CURRENT AFFAIRS IN TELUGU 20th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 20th MARCH 2023

1) భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి పుమియో కిసీడాకు కర్ణాటక కు సంబంధించిన ఏ బహుమతిని ప్రధాని మోడీ అందించారు.?
జ : గంధపు చెక్క మీద చెక్కిన బుద్ధ విగ్రహం

2) 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు ఎంతగా ఉన్నాయి.?
జ : 155.8 లక్షల కోట్లు

3) అంగారక గ్రహం పై నిర్మాణాలు చేపట్టడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపొందించిన కాంక్రీటు పేరు ఏమిటి.?
జ : స్టార్‌క్రేట్

4) బయోడిగ్రడబుల్, రీసైక్లింగ్ గాజు ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : చైనా

5) ఆవుపేడతో కాగితం తయారు చేసిన జైపూర్ వాసి ఎవరు.?
జ : భీమ్‌రాజ్ శర్మ

6) రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానల్ ను అమర్చే టెక్నాలజీని ఏ దేశ స్టార్టప్ కంపెనీ రూపొందించింది.?
జ : స్విట్జర్లాండ్ (సన్ వేస్ స్టార్టప్)

7) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నూతన సీఈవో మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : కే. కృతివాసన్

8) అమెరికా వాయు సేనకు అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : రవి చౌదరి

9) సౌదీ అరేబియా – ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కొత్తచడంలో కీలకపాత్ర పోషించిన దేశం ఏది.?
జ : చైనా

10) ఇటీవల వార్తల్లో నిలిచిన బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గుజరాత్

11) సరస్వతి సమాన్ అవార్డు 2022 ఎవరికి దక్కింది.?
జ : శివశంకరి (తమిళనాడు)

12) గ్లోబల్ రీసైక్లింగ్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 18