1) దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2022 కి గాను ఎవరు ఎంపికయ్యారు.?
జ : నటి, పద్మశ్రీ ఆశా పారేఖ్
2) ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏది.?
జ : జపాన్
3) జపాన్ పాస్ పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలను సందర్శించవచ్చు.
జ : 193
4) 9 రోజులు నిర్వహించే బతుకమ్మ పండగలో ముఖ్యమైన రోజు ఏది.?
జ : సద్దుల బతుకమ్మ
5) 2022లో ప్రపంచంలో అత్యధిక వేతనాలు పెరుగుదలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఇండియా (10.6%)
6) ఇటీవల జరిగినషీసెల్స్ నౌక విన్యాసాలలో భారత్ తరపున పాల్గొన్న నౌక ఏది.?
జ : INS సునయన
7) తెలంగాణ లో నూతనంగా ఏర్పడిన 13 మండలాలు ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయి.?
జ : సెప్టెంబర్ – 26 – 2022
8) ప్రస్తుతం తెలంగాణ లో మండలాల సంఖ్య ఎంత.?
జ : 620
9) సెప్టెంబర్ 26 – 2022న భూమికి అతి సమీపంగా (59 కోట్ల కీ.మీ.) వచ్చిన గ్రహం ఏది.?
జ : బృహస్పతి (జూపిటర్)
10) ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజు జరుపంకుంటారు.?
జ : సెప్టెంబర్ – 27
11) 2022 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ : రీ థింకింగ్ టూరిజం
12) బెర్లిన్ మారథాన్ లో 42.195 కీ.మీ. ల దూరాన్ని 2 గంటల 1 నిముషం 9 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు.?
జ : ఎలీడ్ కిప్ చోగే (కెన్యా)
13) ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగులలో టీట్వంటీ లలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఏది.?
జ : టీమిండియా
14) దేశంలో తొలి శాసనాల మ్యూజియం (ఎఫిగ్రపి మ్యూజియం) ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : హైదరాబాద్
15) ఆగస్టు నెలలో దేశ సగటు నిరుద్యోగ రేటు ఎంత.?
జ : 8.3%