BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 1st OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 1st OCTOBER 2024
1) ఏ దేశం తమ దేశంలోని అన్ని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేసింది.?
జ : బ్రిటన్
2) తాజాగా భారత్ లో పర్యటిస్తున్న జమైకా ప్రధానమంత్రి ఎవరు.?
జ : ఆండ్రూ హోల్‌నెస్
3) భూగర్భ బంకర్లను పేల్చివేసే ఏ క్షిపణి ప్రయోగాన్ని దక్షిణ కొరియా తాజాగా పరీక్షించింది.?
జ : హ్యున్‌మూ
4) పీడే ప్రపంచ చెస్ పురుషుల ర్యాంకింగులలో 3వ స్థానంలో నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ ఇరగేశి
4) సెప్టెంబర్ 2024 లో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 5,267 కోట్లు
5) సెప్టెంబర్ 2024 లో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు ఎంత.?
3,506 కోట్లు
6) మెక్సికో తొలి మహిళ అధ్యక్షురాలిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : క్లాడియా షిన్‌బౌమ్
7) ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి – నాటో నూతన ప్రధాన కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మార్క్ రూట్ (నెదర్లాండ్స్. మాజీ ప్రధాన మంత్రి)
8) తల్లిని చంపేసి, శరీర భాగాలను తినేసిన వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఆ దోషి ఎవరు.?
జ : సునీల్ కుచ్‌కోరవి
9) ఈ ఏడాది రుతుపవన సీజన్‌లో ఎంత శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం తెలిపింది.?
జ : 7.6 శాతం
10) ప్రతిష్టాత్మకమైన ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు ఎవరికి ప్రకటించారు.?
జ : కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు
11) టాటా గ్రూప్‌లోనిఏ రెండు ఎయిర్‌లైన్స్ విలీనం ప్రక్రియ ముగిసింది.?
జ : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ & ఏఐఎక్స్ కనెక్ట్
12) సెప్టెంబర్ 2024 కు గానూ దేశ జీఎస్టీ వసూళ్ళు ఎంత.?
జ : 1.73 లక్షల కోట్లు
13) కాన్పూర్ టెస్టులో భారత్ సంచలన విజయం సాదించింది. దీంతో వరుసగా సొంత గడ్డపై భారత్ ఎన్ని టెస్ట్ సీరీస్ లు గెలుచుకుంది.?
జ : 18 సిరీస్ లు
14) టెస్టుల్లో అత్యధిక సార్లు (11 సార్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుతో అగ్రస్థానంలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ రికార్డు ను ఎవరు సమం చేశారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్
15) కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేశ్ కుమార్ వర్మ