CURRENT AFFAIRS IN TELUGU 1st MARCH 2023

1) సిటీ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనం అయింది.?
జ :యాక్సిస్ బ్యాంక్

2) 6,828 కోట్ల రూపాయలతో వాయుసేన కోసం ఏ శిక్షణ విమానాలను కొనుగోలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.?
జ : హెచ్.టీ.టీ. – 40

3) ఆసియా ఖండంలో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా వెలుపలి బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నాథన్ లియోన్ (136)

4) అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో కలిపి 500 వికెట్లు మరియు 5,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండవ భారత క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవీంద్ర జడేజా (కపిల్ దేవ్ మొదటివాడు)

5) ఫిబ్రవరి 2023 మాసంలో దేశంలో జీఎస్టీ వసూళ్లు ఎంతగా నమోదయ్యాయి.*
జ : 1.49 లక్షల కోట్లు

6) ఐటీ నిపుణుల నియామకాలలో ప్రపంచంలోని నగరాలలో హైదరాబాదుకు ఎన్నో స్థానం దక్కింది.?
జ : పదవ స్థానం

7) ఫిబ్రవరి 2023లో దేశంలో నిరుద్యోగిత ఎంత శాతంగా నమోదయింది.?
జ : 7.45%

8) ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన భారత బౌలర్ ఎవరు?
జ : రవిచంద్రన్ అశ్విన్

9) మూడీస్ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2022 – 23 మరియు 2023 – 24 ఆర్థిక సంవత్సరాలలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంత.?
జ : 2022 – 23 : 6.8%
2023 – 24 : 5 5%

10) ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియా దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.₹
జ : బోలా తినుబు

11) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు..?
జ : రాజేష్ మల్హోత్రా

12) చైనా సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో 2,880 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.?
జ : దిబాంగ్ (అరుణాచల్ ప్రదేశ్)

13) యూఎస్ సైన్స్ ఏజెన్సీ నూతన చీఫ్ గా మొదటిసారి ఒక మహిళను నాసా నియమించింది. ఆమె ఎవరు.?
జ : నికోలా ఫాక్స్

14) నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నూతనంగా ఎన్ని గెలాక్సీలను గుర్తించింది.?
జ : ఆరు గెలాక్సీలను

15) మార్చి 2, 3వ తేదీలలో భారత్ లో పర్యటిస్తున్న ఇటలీ ప్రధానమంత్రి పేరు ఏమిటి.?
జ : జార్జియా మెలోని

16) యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నివేదిక ప్రకారం ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ (IP) నివేదికలో 55 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 42

17) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన రెండో ఆస్ట్రోనాట్ ఫిబ్రవరి 27న అంతరిక్షంలోకి వెళ్లాడు. అతని పేరు ఏమిటి.
జ : సుల్తాన్ అల్ నెయాది

18) FICCI. ( ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నూతన సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శైలెష్ పాథక్