Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 19th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 19th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 19th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 19th SEPTEMBER 2024

1) జూనియర్ హకీ జాతీయ ఛాంపియన్ 2024 గా ఏ జట్టు నిలిచింది.?
జ : పంజాబ్ (14వ సారి)

2) కాంటార్ బ్రాండ్ రిపోర్ట్ లో అత్యంత విలువైన టాప్ 5 భారత బ్రాండ్స్ గా ఏవి నిలిచాయి.?
జ : టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ

3) సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు నిల్వ ఉండేలా మానవ జన్యువు ను 5డీ క్రిస్టల్ లో ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భద్రపరిచారు.?
జ : సౌతాంప్టన్ యూనివర్సిటీ (బ్రిటన్)

4) ఎవరు వేసిన సివిల్ దావా కు అమెరికా కోర్టు భారత్ కు సమన్లు జారీ చేసింది.?
జ : గురుపత్వంత్ సింగ్ పన్నూ (ఖలిస్థానీ ఉగ్రవాది)

5) ఇటీవల మరణించిన తొలి కాశ్మీరీ ఐఏఎస్ అధికారి ఎవరు.?
జ : మహమ్మద్ షఫీ

6) ఎస్ & పీ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.7%

7) ఎస్ & పీ అంచనాల ప్రకారం 2023 – 24 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 8.2%

8) జీడీపీ లెక్కల మదింపు కోసం ప్రాతిపదిక ఏడాది ని 2011 – 2012 నుండి ఏ సంవత్సరానికి మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 2022 – 23

9) అతిగా యాంటీబ‌యోటిక్‌ల వాడకం వలన 2050 నాటికి ఎంతమంది మ‌ర‌ణించే ఛాన్స్ ఉందని ఓ నివేదిక తెలుపుతుంది.?
జ : 4 కోట్ల మంది

10) 1970 తర్వాత భారత్‌లో 2024 ఏ త్రైమాసికం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్రైమాసికంగా నిలిచిందని ‘క్లెమేట్‌ సెంట్రల్‌’ నివేదిక తెలిపింది.?
జ : జూన్‌-ఆగస్టు త్రైమాసికం

11) భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఎన్ని సంవత్సరాలలో ప్రపంచంలోనూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది.?
జ : 6 ఏళ్ళలో

12) మ‌హిళా క్రికెట‌ర్ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఏ హెడ్‌కోచ్‌ ను ఆస్ట్రేలియా క్రికెట్ 20 ఏండ్ల పాటు నిషేధం విధించింది.?
జ : దులీప్ స‌మ‌ర‌వీర‌

13) అంతర్జాతీయ సోలార్ అలయొన్స్ లో 101వ దేశంగా ఏ దేశం చేరింది.?
జ : నేపాల్

14) జోర్డాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జాఫర్ హసన్

15) పురుషుల ఆసియా హకీ టోర్నీ 2024 ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఎవరు నిలిచారు.?
జ : హర్మన్ ప్రీత్ సింగ్

16) పురుషుల ఆసియా హకీ టోర్నీ 2024 లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : యాంగ్ జిహున్ (9 గోల్స్)

17) పురుషుల ఆసియా హకీ టోర్నీ 2024లో బెస్ట్ గోల్ కీపర్ ఎవరు.?
జ : వాంగ్ కాయ్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు