BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 18th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 18th NOVEMBER 2024
1) స్థానిక ఎన్నికల్లో ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలను మారుస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది.?
జ : ఆంధ్రప్రదేశ్
2) భారతదేశ తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా నియమితులయ్యారు.?
జ :కే సంజయ్ మూర్తి (ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర ముర్ము)
3) భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తొలిసారిగా ఈ రైలు ఏ మార్గంలో నడువనున్నది.?
జ : జింద్ – సోనిపట్ మార్గంలో
4) జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో లో
5) 2023 – 24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : భారత్
6) ఏటీపీ పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సిన్నర్ (టేలర్ ఫ్రిట్జ్ పై)
7) 2024లో 76 మ్యాచ్‌లు ఆడి, 70 మ్యాచ్‌లలో గెలిచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుతో సీజన్‌ను ముగించిన టెన్నిస్ ఆటగాడు ఎవరు.?
జ : సిన్నర్
8) దేశంలోనే తొలిసారిగా కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ ను ఏ రాష్ట్రంలో తయారు చేయడానికి ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.?
జ : తెలంగాణ (మంచిర్యాల జిల్లా జైపూర్ లో)
9) జీశాట్ 20 శాటిలైట్ ను ఏ వాహక నౌక ద్వారా అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు.?
జ : స్పేస్ ఎక్స్ – ఫాల్కన్ 9
10) కాప్29 సదస్సులో ఇంధన సామర్థ్యం పెంపుదల కోసం యూఏఈ ప్రతిపాదించిన అలయొన్స్ పేరేమిటి.?
జ : గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియోన్సీ అలయొన్స్
11) మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.7% (గతంలో 7% గా అంచనా)
12) గ్లోబల్ పేటెంట్ పిల్లింగ్ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 6వ
13) FICCI అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అగర్వాల్
14) నీరజ్ చోప్రా తన కోచ్ గా ఎవరిని నియమించుకున్నాడు.?
జ : జాన్ జెలేనీ
15) ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపేనిగా ఏ భారత కంపెనీ నిలిచింది.?
జ : హిందాల్కో