CURRENT AFFAIRS IN TELUGU 17th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 17th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 17th SEPTEMBER 2024

1) నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఛీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనురాగ్ గార్గ్

2) ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ 2024 విజేతకు ప్రైజ్ మనీ ఎంతగా ప్రకటించారు.?
జ : 19.60 కోట్లు

3) ప్రపంచ వెదురు దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 18

4) తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎంజీ గోపాల్

5) ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న నూతన బ్లడ్ గ్రూప్ ఏది.?
జ : మాల్

6) యూరప్ లో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ వేరియంట్ ఏది.?
జ : X EC

7) దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్ గా ఏది గుర్తింపు పొందింది.?
జ : తెలంగాణ అగ్రిహబ్

8) ఏ విదేశీ యూనివర్సిటీ డిల్లీ లో గ్లోబల్ సెంటర్ ను ప్రారంభించింది.?
జ : మెల్‌బోర్న్ యూనివర్సిటీ

9) అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 16

10) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంను ఏరోజు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : సెప్టెంబర్ 17

11) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని

12) హైదరాబాద్ లోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ గణపతి లడ్డూ వేలంలో ఎంత ధర పలికింది.?
జ : 1.87 కోట్లు

13) ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్’ సదస్సును ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూడిల్లీ

14) ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు.?
జ : అరవింద్‌ కేజ్రీవాల్‌

15) ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు.?
జ : అతిశీ

16) డిల్లీ కి మూడో మహిళా సీఎంగా ఎవరు నిలిచారు.?
జ : అతిశీ (సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌)

17) గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌ చైనాను తాకింది. దాని పేరు ఏమిటి.?
జ : టైఫూన్‌ ‘బెబింకా’

18) 33 ఏండ్లు కలిగిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మార్జాలం మరణించింది. దాని పేరు ఏమిటి.?
జ : రోజీ (యూకేలో నార్విచ్‌)

19) ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీని 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్ (ఫైనల్‌ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది.)

20) ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీని మొత్తం మీద భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది.?
జ : ఐదుసార్లు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు