BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 16th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 16th OCTOBER 2024
1) తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం
2) దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్న తెలంగాణ రాష్ట్రం లోని వైద్య సంస్థ ఏది.?
జ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)
3) వివిధ రకాల పంటలకు క్వింటాల్ మద్దతు ధరను తాజాగా ఎంత చొప్పున పెంచినట్టు కేంద్రం ప్రకటించింది.?
జ : గోధుమ ధరను రూ.150, ఆవాల ధరను రూ.300, పెసర్ల ధరను రూ.275, శెనగల ధరను రూ.210, పొద్దుతిరుగుడు ధరను రూ.140, బార్లీ ధరను రూ.130
4) సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) ఎవరు నియామకం కానున్నారు.?
జ : జస్టిస్ సంజీవ్ ఖన్నా
5) ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను తయారు చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న భారతీయుడు ఎవరు.?
జ : సెబిన్ సాజి
6) జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా
7) యూనిసెఫ్ ప్రకారం ఏ దేశంలోని ప్రతి చిన్నారిపై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం చూపాయి.?
జ : లెబనాన్‌లోని
8) భారత్‌కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది.?
జ : చైనా (56.29 బిలియన్ డాలర్లు.)
9) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ ఎవరు.?
జ : నీతూ డేవిడ్‌కు
10) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్స్ ఎవరు.?
జ : ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్
11) ప్రతిష్ఠాత్మక ఖో-ఖో ప్రపంచకప్ 2025 టోర్నీకి ఏ దేశం ఆతిథ్యమివ్వబోతున్నది.?
జ : భారత్ తొలిసారి (జనవరి 13 నుంచి 19 వరకు)
12) ఐసీసీ ఆల్‌టైమ్ టెస్ట్ ర్యాకింగ్స్‌లో టాప్-20 లో తాజాగా చోటు దక్కించుకున్న ఆటగాడు ఎవరు.?
జ : జో రూట్ (ఇంగ్లండ్)