BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 16th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 16th NOVEMBER 2024
1) తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా ఎవరిని నియమించారు.?
జ : డాక్టర్ గుమ్మడి వీ వెన్నెలను (గద్దర్ కూతురు)
2) ఏ మూడు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత్ నుంచి బయలుదేరారు.?
జ : నైజీరియా, బ్రెజిల్, గయాన
3) జీశాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి నవంబర్ 18న ఏ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.?
జ : ఫాల్కన్-9
4) అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో సఖి డిపో పేరున దేశంలోనే తొలిసారిగా రాజధాని ఎక్కడ ప్రారంభమైంది.?
జ : సరోజినీనగర్ డిపో (డిల్లీ)
5) రూ.84 కోట్ల విలువైన సుమారు ఎన్ని పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్‌కు తిరిగి ఇవ్వనున్నట్లు అమెరికాలోని మన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ ఎల్.బ్రాగ్గ్ జూనియర్ తెలిపారు.?
జ : 1440
6) ఏ దేశ శాస్త్రవేత్తలు షుగర్ కంటెంట్‌ను నియంత్రించే రెండు జన్యువులను తొలగించడం ద్వారా టమాటాలకు మరింత తియ్యదనం వచ్చేలా చేశారు.?
జ : చైనా శాస్త్రవేత్తలు
7) అంతరిక్ష ప్రయోగాల్లో ఏ దేశ వ్యోమగాములు మొదటిసారిగా రోదసిలో చేపలను పెంచారు.?
జ : చైనా (షెన్‌జౌ-18 మిషన్)
8) ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్‌ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్ కు చెందిన ఏ బయోటెక్ స్టార్టప్ కంపెనీ ప్రకటించింది.?
జ : ఇమ్యునో క్యూర్
9) ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో కొత్త సేవల కోసం ఏ పేరుతో కొత్త యాప్ ప్రారంభించింది.?
జ : డిస్ట్రిక్ట్
10) మైక్ టైసన్ ఎవరితో జరిగిన హెవీ వెయిట్ బాక్సింగ్ పోటీలలో ఓటమి పాలయ్యారు.?
జ : జేక్ పాల్
11) శ్వేత సౌద తదుపరి ప్రెస్ సెక్రటరీ గా ట్రంప్ ఎవరిని నియమించారు.?
జ : కరోలెన్ లెవిట్
12) మారిషస్ లో భారత హైకమీషనర్ గాఎవరు నియమితులయ్యారు.?
జ : అనురాగ్ శ్రీవాత్సవ
13) అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న న్యాయమూర్తి ఎవరు.?
జ : జస్టిస్ టి. అమరనాధ్ గౌడ్
14) 2024 లో తెలంగాణ రాష్ట్రం లో వరిసాగు ఎన్ని లక్షల హెక్టార్లలో చేశారు.?
జ : 66.77 లక్షల హెక్టార్లు
15) 2024 లో తెలంగాణ రాష్ట్రం లో వరి ధాన్యం ఎన్ని లక్షల టన్నులకు ఉత్పత్తి చేరింది.?
జ : 153 లక్షల టన్నులు
16) 2024లో వరి సాగు మరియు వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : తెలంగాణ