CURRENT AFFAIRS IN TELUGU 16th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 16th FEBRUARY 2023

1) “ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో వాస్కులర్ సర్జన్స్” జీవన సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రధానం చేశారు.?
జ : పద్మశ్రీ దాసరి ప్రసాద్ రావు

2) అంతర్జాతీయ టి20 లలో పాకిస్తాన్ తరఫున తొలి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్ ఎవరు.?
జ : మునీబా ఆలీ

3) తొమ్మిదవ మరియు 10వ వందే భారత్ రైళ్లు ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణించనున్నాయి.?
జ : ముంబై – షోలాపూర్
ముంబై – సాయినగర్ షిర్డీ

4) వ్యవసాయంలో పురుగుమందులను అత్యధిక వినియోగిస్తున్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : నాలుగవ స్థానంలో

5) వ్యవసాయంలో దేశంలో అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్న మొదటి నాలుగు రాష్ట్రాలు ఏవి.?
జ : మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ

6) భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎంవీ సుచీంద్ర కుమార్

7) హైదరాబాదులో బయో ఏసియా సదస్సు ఎప్పుడు జరగనుంది.?
జ : ఫిబ్రవరి 24 నుండి 26వ తేదీ వరకు

8) యూట్యూబ్ నూతన సీఈవోగా ఎంపికైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : నీల్ మోహన్

9) లేజర్ గైడెడ్ రాకెట్ల తయారీ కోసం బీడీఎల్ ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : థేల్స్ (ప్రాన్స్)

10) గిరిజనుల సంస్కృతి ఆచారాలు అలవాట్లను చాటి చెప్పే జాతీయస్థాయి వేడుకలు ఫిబ్రవరి 16 నుండి 27 వరకు ఢిల్లీలో జరగనున్నాయి. వాటికి ఏమని పేరు పెట్టారు.?
జ : ఆది మహోత్సవ్

11) భారతీయ రైల్వేలు భారతీయ తపాలా శాఖ సంయుక్తంగా అందించే పార్సిల్ రవాణా సేవల కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : రైల్ పోస్ట్ గతిశక్తి ఎక్స్‌ప్రెస్ కార్గో సర్వీస్

12) నీటి వినియోగంపై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ‘జల్ జన్ అభియాన్’ పేరుతో నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : బ్రహ్మ కుమారీస్

13) మహిళల హ్యాండ్ బాల్ – ఆసియా ప్రెసిడెంట్ కప్ 2023 విజేత ఎవరు.?
జ : భారత్

14) ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే “జాతీయ వ్యవసాయ గణన”ను ఎప్పటి నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : మార్చి 2023 నుండి