CURRENT AFFAIRS IN TELUGU 16th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 16th APRIL 2023

1) ADR నివేదిక ప్రకారం అత్యధిక అప్పులు‌, కేసులు ఉన్న సీఎం ఎవరు.?
జ : కేసీఆర్

2) వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం అత్యధిక నేరాలు కలిగిన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 77వ స్థానంలో

3) వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం అత్యధిక నేరాలు కలిగిన దేశాల జాబితాలో మొదటి, చివరి స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?జ : వెనిజులా మొదటి, జపాన్ చివరి స్థానంలో

4) ఒక నివేదిక ప్రకారం అత్యంత సంతోషకర రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : మిజోరాం

5) G7 దేశాల మంత్రుల స్థాయి సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది.?
జ : కరిజావా

6) G7 కూటమి సభ్య దేశాలు ఏవి.?
జ : అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, కెనెడా, ప్రాన్స్, ఇటలీ, ఈయూ

7) 2 వేల ఏళ్ల నాటి నేత పనిలో వాడే పనిముట్టు ” స్పూల్న్” ను ఎక్కడ ఇటీవల కనిపెట్టారు.?
జ : ఆకునూర్ గ్రామం (సిద్దిపేట జిల్లా)

8) 6వేల ఏళ్ల నాటి కాలమ్నర్ బసాల్ట్ అనే లావా జాతి శిలలను ఇటీవల తెలంగాణ లో ఎక్కడ కనిపెట్టారు.?
జ : కరిమెరి – గౌరి ప్రాంతం ( కోమురం భీం జిల్లా)

9) ఇటీవల మేఘాలయలోని గుహలలో కనిపెట్టిన నూతన జాతి కప్పకు ఏమని నామకరణం చేశారు.?
జ : అమెలోప్స్ సిజు

10) ఇటీవల తెలంగాణలో అయ్యనార్ ల పురాతన విగ్రహాన్ని ఎక్కడ గుర్తించారు.?
జ : నేలపోగుల గ్రామం (జనగామ జిల్లా)