1) ఐక్యరాజ్యసమితి మహిళా సిబ్బంది పై నిషేధం విధించిన దేశం ఏది?
జ : ఆఫ్గానిస్థాన్
2) ఏ దేశంలో పదవి విరమణ వయసును 64 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.?
జ : ఫ్రాన్స్
3) తైపా – 1 అనే ఉపగ్రహాన్ని ఏ ఆప్రికా దేశం విజయవంతంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ – 9 రాకెట్ ద్వారా ప్రయోగించింది.?
జ : కెన్యా
4) అంబేద్కర్ తో సంబంధం ఉన్న ప్రాంతాలను కలుపుతూ భారతీయ రైల్వే ప్రారంభించిన రైలు పేరు ఏమిటి?
జ : అంబేద్కర్ సర్క్యూట్ గౌరవ్ రైలు
5) క్యాన్సర్ నిరోధం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అభివృద్ధి చేసిన ఆయుర్వేద ఔషధం పేరు ఏమిటి.?
జ : V2S2
6) యూరప్ అంతరిక్ష పరిశోధనా సంస్థ గురు గ్రహం మరియు దాని ఉపగ్రహాల మీద అధ్యయనం కోసం ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఏమిటి?
జ : జ్యూస్
7) మానవులలో సాధారణంగా వ్యాపించే ఏ వైరస్ ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల కనిపెట్టారు.?
జ : EBV (ఎప్‌స్టెయిన్ బార్ వైరస్)
8) ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన కుబేరుల జాబితాలో భారత్ లో అత్యంత వృద్ధ బిలినియర్ గా చోటు సంపాదించిన వ్యక్తి ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : కేశబ్ మహీంద్రా
9) హాకీ ఇండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్పి సింగ్
10) స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2021 – 22లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ