1) మార్చి 18 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో తెలంగాణ నుంచి ఏ ఆహార పంటకు అవకాశం దక్కింది.?
జ : తాండూరు కందిపప్పు
2) ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 మార్చి 15 నుండి ఎక్కడ ప్రారంభం కానుంది.?
జ : న్యూ ఢిల్లీ
3) స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య – 50 నగరాలలో మొదటి మూడు స్థానాల్లో ఏవి ఉన్నాయి.?
జ : లాహోర్ (పాక్), హోటన్ (చైనా) , బీవడి (భారత్)
4) టోకు ధరల సూచి (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 2023 లో ఎంతగా నమోదయింది.?
జ : 3.85%
5) ఇటీవల అంగారకుడి గ్రహంపై ఇసుక దిబ్బల చిత్రాలను పంపిన నాసా కు చెందిన ఆర్బిటర్ పేరు ఏమిటి.?
జ : మార్స్ రికానిసెన్స్ ఆర్బీటర్
6) బుకర్ ప్రైజ్ 2023 పరిశీలకుల పరిశీలన జాబితాలో చోటు సంపాదించిన తమిళ పుస్తకం పేరు ఏమిటి?
జ : ఫైర్ (PYRE) (పుక్కులి) – పెరుమాళ్ మురుగన్
7) వికిరణ, అణుధార్మిక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఔషధాన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ప్రష్యన్ బ్లూ
8) ఇటీవల అమెరికా ఏ దేశంతో కలిసి అతిపెద్ద మిలిటరీ విన్యాసాలను చేపట్టింది.?
జ : దక్షిణ కొరియాతో కలిసి
9) అణు సామర్థ్యం గల జలాంతర్ గాములను ఏ దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అతి పెద్ద రక్షణ ఒప్పందాన్ని ఆస్ట్రేలియా కుదుర్చుకుంది.?
జ : అమెరికా, బ్రిటన్ నుంచి
10) అవయవ దాతల నుండి అవయవాలను స్వీకరించడానికి స్వీకర్తలకు ఎంతగా ఉన్న వయోపరిమితి లిమిట్ ను కేంద్రం తొలగించింది..?
జ : 65 సంవత్సరాలు
11) ఆస్ట్రేలియా, ప్రాన్స్, ఇండియా, జపాన్, అమెరికా దేశాల నావికాదళాలు హిందూ మహాసముద్రంలో చేపట్టిన నావికా విన్యాసాల పేరు ఏమిటి.?
జ : లా ఫేరౌజ్ (La Perouse)
12) అంతర్జాతీయ బుద్ధిజం హెరిటేజ్ సదస్సు ను భారతదేశము ఎక్కడ నిర్వహిస్తుంది.?
జ : న్యూఢిల్లీ
13) ‘షీ చేంజెస్ క్లైమేట్’ కార్యక్రమానికి భారత తరఫున రాయబారిగా ఎవరిని నియమించారు.?
జ : శ్రేయా గోద్వాత్