BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 13th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 13th NOVEMBER 2024
1) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అరవింద్ సింగ్ సాహ్నీ
2) అమెరికా రక్షణ శాఖ మంత్రి గా ట్రంప్ ఎవరిని నియమించారు.?
జ : పీట్ హెగ్సెత్
3) అమెరికా సీఐఏ డైరెక్టర్ గా ట్రంప్ ఎవరిని నియమించారు.?
జ : జాన్ రాట్‌క్లిఫ్
4) వరల్డ్ ఇంటిలెక్చ్‌వల్ ప్రోపర్టీ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 6వ
5) రిజర్వ్ ఆఫ్ ఇండియా భారత్ లో ముఖ్యమైన బ్యాంకులుగా వీటిని పేర్కొంది.?
జ : ఎస్ బి ఐ, హెచ్ డి ఎఫ్ సి, ఐ సి ఐ సి ఐ
6) బ్రిటిష్ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ ఏ సోషల్ మీడియా సంస్థ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.?
జ : ఎక్స్
7) అమెరికా సెనెట్ లో మెజారిటీ నేతగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జాన్ తూన్
8) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లకు వీడ్కోలు పలికిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఎవరు.?
జ : మొహ్మద్ నబీ
9) ఏ పథకంలో భాగంగా తెలంగాణ లో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ?
జ : పీఎం కుసుమ్
10) సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు. ?
జ : జస్టిస్ సూర్యకాంత్
11) ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచింది.?
జ : డిల్లీ
12) బిలియనర్స్ రో గ్రూప్ న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ మధ్యప్రాంతంలో ఎన్ని వేల అడుగుల ఎత్తుతో ఒక మహా భవనాన్ని నిర్మించనున్నది. ?
జ : 4,000
13) ప్రపంచంలోనే సెక్సియెస్ట్ మ్యాన్ 2024 అలైవ్‌గా ఎవరిని పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది.?
జ : అమెరికా నటుడు, దర్శకుడు జాన్ క్రసిన్‌స్కీ
14) బుకర్ ప్రైజ్-2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే
15) బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే రచించిన ఏ నవలకు బుకర్ ప్రైజ్ 2024 దక్కింది..?
జ : ఆర్బిటాల్
16) డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్న్‌మెంట్ ఎఫిషియన్సీ శాఖను ఏర్పాటు చేసిన ట్రంప్ దీని బాధ్యతలు ఎవరికి అప్పగించారు.?
జ : ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి.