BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 12th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 12th NOVEMBER 2024
1) ‘మిస్ టీన్ యూనివర్స్-2024’ కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు.?
జ : తృష్ణా రే (ఇండియా)
2) వెయ్యి మందికి పైగా మహిళా సిబ్బంది కలిగిన మొట్టమొదటి పూర్తి మహిళా ఏ రిజర్వ్ బెటాలియన్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.?
జ : సీఐఎస్‌ఎఫ్
3) ఒడిశా తీరం చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) తొలి ఫ్లయిట్ టెస్ట్‌ని ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది.?
జ : DRDO
4) సైన్యం ఏ భారత తయారీ హెలికాప్టర్ ను అత్యంత ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది.?
జ : ప్రచండ
5) ఏ రకమైన జెల్లీషిష్ కు మరణం లేదని, దానికి వయసును రివర్స్ చేసుకొనే అసాధారణ సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : టర్రిటోప్సిస్ డోర్నీ
6) అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా ట్రంప్ ఎవరిని నియమించారు.?
జ : మైక్ వాల్జ్
7) అక్టోబర్ 2024 లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది.?
జ : 6.21 శాతం
8) అక్టోబర్‌లో వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) ఎంత శాతంగా నమోదైంది.?
జ : 10.87 శాతం
9) ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఎంత శాతం నమోదైంది.?
జ : 3.1 శాతం
10) ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అక్టోబర్ 2024 అవార్డులలో పురుషుల విభాగంలో ఎవరు నిలిచారు.?
జ : పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ ఆలీ,
11) ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అక్టోబర్ 2024 అవార్డులలో మహిళల విభాగంలో ఎవరు నిలిచారు.?
జ : అమేలియా కేర్
12) ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : మునాఫ్ పటేల్
13) భారత గడ్డ పై ఒకే వేదికలో అత్యధిక వికెట్లు (23) తీసిన విదేశీ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.?
జ : అజాజ్ పటేల్ (వాంఖడే లో)
14) అమెరికా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు ను ఎవరికి ప్రకటించింది.?
జ : ప్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా