13 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ – వేస్ట్ ) అధికంగా గల దేశాలు ఏవి.?
జ : చైనా, అమెరికా, భారత్

2) ఇటీవల మరణించిన జాతీయ మహిళ కమీషన్ తొలి చైర్మన్ ఎవరు.?
జ : జయంతి పట్నాయక్

3) ఇటీవల జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఏ రాకెట్ విఫలమైంది.?
జ : ఎప్సిలాన్ – 6

4) ఇక్రిశాట్ నూతనంగా విడుదల చేసిన వేరుశనగ నూతన వంగడం పేరు ఏమిటి.?
జ : ICGV-16668

5) కేంద్రం ప్రకటించిన జల్ జీవన్ మిషన్ లో తెలంగాణకు ఎన్నో స్థానం దక్కింది.?
జ : 5వ స్థానం

6) గృహాలకు నిరంతర తాగునీటి సరఫరా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

7) సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2022ను ఎవరికి ప్రకటించారు.?
జ : అందేశ్రీ

8) ఐరాస ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2022 సమావేశాలు ఏ నగరంలో నిర్వహించారు.?
జ : హైదరాబాద్

9) ‘ప్రపంచ వన్యప్రాణుల జీవరాశుల నివేదిక 2022’ ప్రకారం గత 48 సంవత్సరాలలో భూమి మీద వన్యప్రాణుల శాతం ఎంతకు తగ్గిపోయింది.?
జ : 69%

10) దేశంలోనే అత్యంత నెమ్మదిగా పనులు జరుగుతున్న రైల్వే మార్గంగా ఏం మార్గం నిలిచింది.?
జ : మునీరాబాద్ – మహబూబ్ నగర్ రైలు మార్గం

11) ఇండియన్ అగ్రికల్చర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నివేదిక ప్రకారం ఏ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది.?
జ : పాలు‌, పప్పు దినుసులు, జూట్ ఉత్పత్తులు

12) “అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా 2022” అని నీతి అయోగ్ నివేదిక ప్రకారం ఎంత శాతం మురగు నీరు నదులలోకి వదులుతున్నారు.?
జ : 72%