CURRENT AFFAIRS IN TELUGU 10th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 10th FEBRUARY 2023

1) కాయిన్ వెండింగ్ మెషిన్ లను ఫైలట్ ప్రాజెక్టుగా మార్కెట్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్న సంస్థ ఏది.?
జ : ఆర్బీఐ

2) అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొదటి కెప్టెన్ గా ఎవరు నిలిచారు.?
జ : రోహిత్ శర్మ

3) స్వదేశాలలో డాన్ బ్రాడ్ మాన్ (98.2) తర్వాత టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సగటు కలిగిన క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు.?
జ : రోహిత్ శర్మ (74.7)

4) బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ రచించిన ఏ నవల ఇటీవల విడుదల అయింది.?
జ : విక్టరీ సిటీ

5) సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల (MSME) సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : వివాద్ సే విశ్వాస్

6) మయన్మార్ ఇటీవల ఏ దేశంతో అను శక్తి సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : రష్యా

7) కేంద్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఏ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు.?
జ : మిషన్ అంత్యోదయ సర్వే – 2022 – 23

8) గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) 2022 నివేదికలో అక్రిడేషన్, స్టాండర్టైజేషన్, మెట్రాలజీ సూచిలలో 184 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : అక్రిడేషన్ – 5వ స్థానం
స్టాండర్టైజేషన్ – 9వ స్థానం
మెట్రాలజీ – 21వ స్థానం

9) గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) 2022 నివేదికలో మొత్తంగా 184 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 10

10) ఎరో ఇండియా వైమానిక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 13 నుండి ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : బెంగళూరు

11) ఇటీవల అమెరికా ప్రయోగించిన ఖండాంత క్షిపణి 6,800 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ క్షిపణి పేరు ఏమిటి.?
జ : మినిట్ మ్యాన్ – 3 క్షిపణి

12) జీవశాస్త్ర విభాగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఫిట్ (ప్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్)

13) ఫార్ములా ఈ – రేస్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 ను ఫిబ్రవరి 11వ తేదీన ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్

14) పారిశ్రామిక వృద్ధి డిసెంబర్ 2022 నెలలో ఎంత శాతంగా నమోదయింది.?
జ : 4.3%

15) ఇస్రో ప్రయోగించిన SSLV D2 రాకెట్ ద్వారా ఏ శాటిలైట్లను అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు.?
జ : EOS 07, JANUS – 1, AZAADISAT – 2

16) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో భారత్ తరపున 450 పైగా వికెట్లు సాధించిన రెండవ బౌలర్ ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్

17) మహీంద్రా సంస్థ తెలంగాణలోని ఏ ప్రాంతంలో 1000 కోట్లతో ఎలక్ట్రానిక్ వాహనాల పరిశ్రమను ఏర్పాటు చేయమంది.?
జ : జహీరాబాద్