13 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్

1) దేశంలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారంటీ స్కీమ్ ను ప్రవేశ పెట్టిన బ్యాంకు ఏది.?
జ : HDFC

2) ఆహార భద్రత అట్లాస్ ని రూపొందించిన మూడవ రాష్ట్రం ఏది.?
జ : జార్ఖండ్ (బీహార్, ఒడిశా)

3) జాతీయ స్థాయి క్రీడలలో మొదటి మూడు స్థానాలలో నిలిచిన క్రీడాకారులకు నెలనెలా స్టైఫండ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : పంజాబ్

4) ఆగస్ట్ 2021 తో పోలిస్తే ఆగస్ట్ 2022 నాటికి భారత రైల్వే వృద్ధి శాతం ఎంత పెరిగింది.?
జ : 38%

5) 22వ షాంఘై సహకార సంఘం (SCO) సదస్సు ఎక్కడ జరగనుంది.?
జ : ఉజ్బెకిస్తాన్

6) షాంఘై సహకార సంఘం (SCO) లో సభ్య దేశాలు ఏవి.?
జ : (8) – చైనా, రష్యా, భారత్, పాకిస్థాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్

7) అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ATP) తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన అతి పిన్న వయస్కుడుగా ఎవరు నిలిచారు.?
జ : అలకరాజ్

8) ఏ దేశంలో రైల్ ను రామెన్ సూప్ అనే ఆహర పదార్థం (బయో ఆయిల్) తో విజయవంతంగా నడిపారు.?
జ : జపాన్

9) ప్రపంచంలో మొట్టమొదటి ఒక కంపెనీ కి సీఈఓ గా నిలిచిన రోబో పేరు ఏమిటి.?
జ : మిస్ టాంగ్ యూ

10) ఎన్నికల లో పోటీ చేయడం ఏ హక్కు కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.?
జ : ప్రాథమిక, చట్టపరమైన హక్కు కాదు అని పేర్కొంది

11) తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ఏ రోజు నిర్వహించనున్నారు.?
జ : సెప్టెంబర్ 17

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

12) భారత్ 2024 లో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర పేరు ఏమిటి.?
జ : గగన్ యాన్

13) భారత్ 2023 లో అంతరిక్షంలోకి పంపనున్న హ్యుమనాయిడ్ పేరు ఏమిటి.?
జ : వ్యోమ్ మిత్ర

14) ఎలాంటి లక్షణాలు లేకున్న కూడా పలు రకాల క్యాన్సర్ లను ముందుగానే గుర్తించేందుకు ఇటీవల ఆవిష్కరించిన పరీక్ష పేరు ఏమిటి.?
జ : MCED (మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్)

Follow Us @