Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 9th DECEMBER 2024

CURRENT AFFAIRS 9th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 9th DECEMBER 2024

CURRENT AFFAIRS 9th DECEMBER 2024

1) మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పించేందుకు ఎల్‌ఐసీ నుంచి ఏ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.?
జ : ఎల్ఐసీ బీమా సఖి యోజన

2) సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఏ సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ తెలిపింది.?
జ : 2024

3) బుర్కినా ఫాసోకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఓం ప్రకాష్‌ మీనా

4) సుమారు 8 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిప‌ణిని ప‌సిక‌ట్టేయ‌గ‌ల ఏ రాడార్ ను ర‌ష్యా నుంచి భార‌త్ కొనుగోలు చేయ‌నున్న‌ది.?
జ : వొరోనేజ్‌

5) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా (26వ) ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
జ : సంజయ్‌ మల్హోత్రా

6) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి 6 నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్‌ చేసిన రుణాల విలువ ఎంత.?
జ : రూ.42,035 కోట్లు

7) జాతీయ పంచాయతీ పురష్కారాలు 2024 లో పంచాయతీ మిత్ర విభాగంలో తెలంగాణ ఏ బహిమతి గెలుచుకుంది.?
జ : 2వ

8) అమెరికా లోని ఏ రాష్ట్ర రాజధానిలో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరించారు.?
జ : నబ్రాస్కా రాజధాని లింకన్ లో

9) డయానా అవార్డు 2024 ఎవరికి ప్రకటించారు.?
జ : దియా లోకా (హైదరాబాద్)

10) ప్రపంచ నేల దినోత్సవం డిసెంబర్ 5న నిర్వహించారు. 2024 థీమ్ ఏమిటి.?
జ : Caring for soils – Measure, Monitor, Manage.

11) ప్రాన్స్ లోని ఏ ప్రఖ్యాత చర్చిని ట్రంప్, మెక్రాన్, జెలన్‌స్కీ పునఃప్రారంభించారు.?
జ : నోట్రడామ్

12) ఏ భారత క్రైస్తవ మతాచార్యుడికి కార్డినల్ గా పదోన్నతి లభించింది.?
జ : జార్జి జాకబ్ (కేరళ)

13) 200 మీటర్ల పరుగు పోటీలలో ఉసెన్ బోల్ట్ రికార్డు (20.13 సెకండ్ల) ను ఎవరు బద్దలుకొట్టారు.?
జ : గౌట్ (20.04 సెకండ్లు)

14) తైపీ ఓపెన్ ఇండోర్ సిరీస్ లో స్వర్ణం నెగ్గిన భారత ఆర్చర్ ఎవరు.?
జ : జ్యోతి సురేఖ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు