BIKKI NEWS : CURRENT AFFAIRS 5th DECEMBER 2024
CURRENT AFFAIRS 5th DECEMBER 2024
1) ప్రోబా-3 మిషన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను ఏ వాహకనౌక ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.?
జ : పీఎస్‌ఎల్వీ-సీ59
2) ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన వంద నగరాల జాబితా-2024లో భారత్ నుంచి ఏ నగరం స్థానం పొందింది.?
జ : ఢిల్లీ
3) మహారాష్ట్ర సీఎంగా, డిప్యూటీ సీఎంలుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : దేవేంద్ర ఫడ్నవీస్ (షిండే, పవార్)
4) రోడ్డు ప్రమాదాల్లో ఎడాదిలో ఎంత మంది దుర్మరణం చెందారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : 1.68 లక్షలు
5) ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవి కోల్పోయిన ప్రధానమంత్రి ఎవరు.?
జ : మిషెల్ బార్నియర్
6) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చీఫ్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎవరిని ప్రకటించారు.?
జ : వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మన్
7) 8.5 లక్షల కోట్లతో ప్రైవేటు అంతరిక్ష కేంద్రం చేసే బాధ్యతను ఏ సంస్థ తీసుకుంది.?
జ : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్
8) బిట్‌కాయిన్ తాజాగాఎంత విలువకు చేరుకుంది.?
జ : లక్ష డాలర్లకు
9) యూత్ ఒలింపిక్స్ 2026 నుంచి తాజాగా ఏ క్రీడలను తీసేశారు.?
జ : షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ
10) చాంపియన్స్ ట్రోఫీ (2025) ని ఏ పద్దతిలో నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమైంది.?
జ : హైబ్రిడ్ మోడల్‌లో
- CURRENT AFFAIRS 11th DECEMBER 2024
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు