Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 3rd DECEMBER 2024

CURRENT AFFAIRS 3rd DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 3rd DECEMBER 2024

CURRENT AFFAIRS 3rd DECEMBER 2024

1) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .?
జ : ఆంధ్రప్రదేశ్

2) బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్‌ ఎవరు.?
జ ప్రణయ్‌ వర్మ

3) భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి ఫెర్టిలిటీ రేట్‌ ఎంతకు తగ్గనుంది.?
జ : 1.29

4) ఏ దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ విధించారు.?
జ : దక్షిణ కొరియా

5) దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు.?
జ : యూన్‌ సుక్‌ యోల్‌

6) భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నదని ఏ దేశ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.?
జ : అమెరికా

7) ఏ ఎయిర్‌కార్గోకు ‘టైం క్రిటికల్‌ లాజిస్టిక్స్‌ సొల్యుషన్‌ ప్రొవైడర్‌ ఆఫ్‌ ది ఈయర్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్టెన్‌ అవార్డు లభించింది.?
జ : శంషాబాద్‌ ఎయిర్‌కార్గో

8) 57 ఏండ్ల (1967లో చివరి సారిగా) తర్వాత ప్రతిష్ఠాత్మక సంతోశ్‌ ట్రోఫీ ఫైనల్స్‌కు ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది.?
జ : హైదరాబాద్‌

9) మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌-2025 ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : భారత్‌

10) బోపాల్ గ్యాస్ దుర్ఘటన జ‌రిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ?
జ : 40 (1984 డిసెంబర్ 2,3)

11) జీడీపీ లెక్కింపు ఆధార సంవత్సరాన్ని 2011 – 12 నుండి ఏ సంవత్సరానికి మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 2022 – 23

12) ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య చక్ర పురష్కారం 2024 ఎవరికి ప్రకటించింది.?
జ : భారత నౌక కెప్టెన్ అవిలాష్ రావత్

13) నాగాపూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ ఏ ఆత్మాహుతి డ్రోన్ ను భారత సైన్యానికి అందించింది.?
జ : నాగాస్ర్త – 1

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు