BIKKI NEWS : CURRENT AFFAIRS 26th NOVEMBER 2024
CURRENT AFFAIRS 26th NOVEMBER 2024
1) తాజా లెక్కల ప్రకారం అమెరికా అప్పు ఎంతగా ఉంది.?
జ : 36 ట్రిలియన్ డాలర్లు (3,035 లక్షల కోట్ల రూపాయలు.)
2) దేశద్రోహం ఆరోపణలపై ఏ ప్రముఖ హిందూ నాయకుడిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.?
జ : చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి
3) ఇటలీలోని మాంటెసిల్వానో వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ అండర్-8 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ఏ క్రీడాకారుడు విజేతగా నిలిచాడు.?
జ : అదుల్లా దివిత్‌రెడ్డి
4) ఏ భారత స్టార్ రెజ్లర్ పై డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్స్ ఇవ్వని కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) నాలుగేండ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : బజరంగ్ పునియా
5) అత్యంత పిన్నవయస్కుడైన ఏ ఆటగాడిని ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది..?
జ : వైభవ్ రఘువంశీ
6) ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందిన ఏ వ్యక్తి మరణించారు.?
జ : జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ ఉడ్
7) 40 వేల కోట్ల ఆస్తిని త్యజించి బౌద్ధ సన్యాసి గా మారిన మలేషియా యువకుడు ఎవరు.?
జ : వెన్ అజాన్ సిరిపన్నో
8) బ్రహ్మోస్ ఏరోస్పేస్ నూతన సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జైతీర్థ్ రాఘవేంద్ర జోషి
9) అంతర్జాతీయ సహకార కూటమి సదస్సు 2024 ఏ నగరంలో జరిగింది.?
జ : న్యూడిల్లీ
10) రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్ళించడానికీ కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది. ?
జ : 2,481 కోట్లు
11) బ్యాంకు ఆఫ్ చైనా ఏ మాజీ చైర్మన్ కు అవినీతి ఆరోపణలపై మరణశిక్ష విధించారు.?
జ : లీ లియాంగే
12) జాతీయ క్షీర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 26
13) జాతీయ రాజ్యంగ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : నవంబర్ 26
14) జాతీయ న్యాయ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : నవంబర్ 26
- UPSC NDA & NA (I) 2025 NOTIFICATION
- CURRENT AFFAIRS 11th DECEMBER 2024
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి