1) ఆప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం ఇటీవల మహిళలను ఏ సంస్థలలో పని చేయడాన్ని నిషేంధించింది.?
జ : స్వచ్ఛంద సంస్థలు (NGO”s)
2) ఫిజీ దేశ నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : సితవేని రబూకా
3) విద్యార్దినిలకు మాతృత్వ సెలవులను ఏ రాష్ట్ర యూనివర్సిటీ కల్పించింది.?
జ : మహత్మ గాంధీ యూనివర్సిటీ (కేలళ)
4) నేరస్థుడు చార్లెస్ శోభరాజ్ తాజాగా నేపాల్ జైలు నుండి విడుదల అయ్యాడు. అతను ఏ దేశానికి చెందిన వాడు.?
జ : ప్రాన్స్
5) అమెరికా విదేశాంగ విభాగంలో డిప్యూటీ సెక్రటరీ గా బైడెన్ నియమించిన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : రిచర్డ్ వర్మ
6) విజయ్ మర్చంట్ అండర్ 16 టోర్నీలో 6 పరుగులకే ఆలౌట్ అయినా జట్టు ఏది.?
జ : సిక్కిం
7) ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ 2023 లో భారత జట్టు కెప్టెన్ ఎవరు.?
జ : హార్మన్ ప్రీత్ సింగ్
8) ఇటీవల అరెస్ట్ అయిన ఐసీఐసీఐ మాజీ చైర్మన్ ఎవరు.?
జ : చందా కొచ్చర్
9) భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఇన్‌కొవాక్ పేరు ఏమిటి.?
జ : BBV154
10) అమెరికా లో వీస్తున్న చలిగాలులు వలన ఎర్పడిన అతి శీతల ఉష్ణోగ్రత పరిస్థితి కి ఏమని పేరు పెట్టారు.?
జ : బాంబ్ సైక్లోన్
11) జెనీవా యూత్ హ్యూమన్ రైట్స్ పురష్కారం పొందిన భారతీయురాలు ఎవరు.?
జ : డా. కృతి భారతి (రాజస్థాన్)
12) ఎకో వంతెనలు అనగానేమి.?
జ : వన్యప్రాణుల రాకపోకలు సాగించడానికి వీలు కల్పించే లా నిర్మించే వంతెనలు
13) భారత్ లో పూర్తి స్థాయిలో నిర్మించిన ఎకో వంతెన ఏది.?
జ : నాగపూర్ – ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే
14) 24 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా ప్రవహించే ఎన్ని నదుల పునర్ జీవనానికి 19 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.?
జ : 13 నదులు
15) ఆర్బిఐ తాజా నివేదిక ప్రకారం 2021 22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల తలసరి ఆదాయం ఎంత.?
జ : TS – 1,58,561
AP – 1,43,816
16) భారత ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ లక్ష్యం ఏమిటి.?
జ : జి 20 దేశాల స్టార్టప్ లకు వ్యూహాత్మక సహకారం
17) 2006 – 2018 మధ్యాహ్నం సముద్రమట్టాలు ఎంత మేర పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వా నివేదిక తెలుపుతుంది.?
జ: సంవత్సరానికి 3.7 మి.మీ.
18) సామాజిక పురోగతి సూచిక 2022లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ర్యాంకులు ఎంత.?
జ : AP – 23
TS – 26
19) 2021 22 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక (1), మహారాష్ట్ర(2), తెలంగాణ(3), ఆంధ్రప్రదేశ్ (15)
20) కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారి వివరాలు సేకరించడానికి కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?
జ: మహారాష్ట్ర
21) రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యురాలిని మొదటిసారిగా ప్యానల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేశారు ఆమె ఎవరు.?
జ : పీటీ ఉష