CURRENT AFFAIRS : 22nd DECEMBER 2022

1) కోవిడ్ 19 ప్రస్తుతం ఏ రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తుంది.?
జ : ఒమిక్రాన్ బీఎఫ్ 7

2) యునెస్కో కింగ్ సాజంగో లిటరసీ ప్రైజ్ ను భారత్ లోని ఏ సంస్థ గెలుచుకుంది.?
జ: ఒడిస్సా లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

3) యునెస్కో అభ్యసన నగరాల జాబితా లో తెలంగాణ నుంచి ఏ నగరం ఎంపికైంది.?
జ : వరంగల్

4) రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి స్థానంలో

5) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2022లో నవల విభాగంలో అవార్డు పొందిన తెలుగు నవలా రచయిత ఎవరు.?
జ : మధురాంథకం నరేంద్ర (మనోధర్మపరాగం – నవల)

6) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2022లో అనువాద విభాగంలో అవార్డు పొందిన తెలుగు రచయిత ఎవరు.?
జ : వారాల ఆనంద్ (ఆకుపచ్చ కవితలు)

7) 2022 కు గాను ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ఎవరు దక్కించుకున్నారు.?
జ : దేశంలోని మొత్తం వైద్య సిబ్బంది

8) ఆస్కార్ 2023 అవార్డులకు భారత్ నుండి అధికారికంగా పంపబడిన చిత్రం ఏది.?
జ : ఛెల్లో షో (గుజరాతి సినిమా)

9) అమెరికా తాజాగా ఉక్రెయిన్ కు ఏ క్షిపణులను అందించింది.?
జ: ఫెట్రీయొట్ క్షిపణులు

10) కేవలం ఏ యూనివర్సిటీ NAAC నుండి గ్రేడ్ ఏ సర్టిఫికెట్ నం పొందింది.?
జ : గురునానాక్ దేవ్ యూనివర్సిటీ

11) డిజిటల్ ఇండియా 2022 అవార్డును కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ గెలుచుకుంది.?
జ : కేంద్ర పట్టణ & గృహ అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ

12) డిసెంబర్ 22 ను ఎవరి జయంతి సందర్భంగా గణిత దినోత్సవంగా భారత్లో జరుపుకుంటారు.?
జ : శ్రీనివాస రామానుజన్

13) ఏ రాష్ట్రం టూరిజం శాఖకు వాణిజ్య హోదాను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : అస్సాం

14) ఏ తెలుగు సినిమా పాట ఆస్కార్ అవార్డ్స్ 2023లో ఒరిజినల్ సౌండ్ విభాగంలో ఎంపికైంది.?
జ : నాటు నాటు (RRR)

15) ఒలంపిక్ ఆర్గనైజింగ్ కమిటీ 2032కు సీఈవోగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : షిండీ హుక్

16) ప్రపంచవ్యాప్తంగా 2022 లో పిల్లల ఆట బొమ్మల ఎగుమతుల విలువ 73.2 బిలియన్ డాలర్లు అయితే అందులో సింహభాగం పొందిన దేశం ఏది.?
జ : చైనా (48.6 బి. డాలర్లు)

17) జర్మనీకి చెందిన మెట్రో హోల్సేల్ రిటైల్ షోరూమ్ లను భారత్ లో దక్కించుకున్న సంస్థ ఏది.?
జ : రిలయన్స్

18) దేశంలో తొలి ముస్లిం మహిళ ఫైటర్ పైలెట్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సానియా మీర్జా