BIKKI NEWS : CURRENT AFFAIRS 20th DECEMBER 2024
CURRENT AFFAIRS 20th DECEMBER 2024
1) భూ భారతి పేరుతో చట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ?
జ : తెలంగాణ
2) మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూశారు. ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేశారు.?
జ : హర్యానా
3) ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని క్వింటాలుకు ఎంతకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : ₹ 422/-
4) ఇటీవల వార్తల్లో నిలిచిన సిరియా రాజధాని నగరం ఏది.?
జ : డమాస్కస్
5) నవంబర్ 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.?
జ : 652.87 బిలియన్ డాలర్లు
6) జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్స్ షిప్ లో విజేతలుగా ఎవరు నిలిచారు.?
జ : ధీరజ్ & దీపికా కుమారి
7) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 హిందీ భాషా విభాగంలో ఏ రచయిత గెలుచుకున్నారు.?
జ : గగన్ గిల్
8) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 ఆంగ్ల భాషా విభాగంలో ఏ రచయిత గెలుచుకున్నారు.?
జ : ఈస్టరిన్ కెరె
9) డిల్లీ ముఖ్యమంత్రి అతిశి నెలకు మహిళలకు వెయ్యి రూపాయలు అందజేసే ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది.?
జ : ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన
10) అంతరిక్షంలో పోగుపడుతున్న చెత్తను తొలగించేందుకు ఏ రెండు దేశాల స్టార్టప్ కంపెనీ లు లేజర్ శాటిలైట్ ను ఉపయోగించేందుకు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : భారత్ & జపాన్
11) 2023 – 24 సంవత్సరంలో భారత దేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్
12) అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 21
13) భారతలో జరగనున్న ఖో ఖో వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు.?
జ : సల్మాన్ ఖాన్
14) కేంద్రమంత్రి ఇంద్ర సింగ్ ఆవిష్కరించిన యాంటీ పెస్టిసైడ్ షూట్ పేరేమిటి.?
జ : కిసాన్ కవచ్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్