CURRENT AFFAIRS : 1st JANUARY 2023

CURRENT AFFAIRS : 1st JANUARY 2023

1) ఇటీవల మరణించిన పుట్‌బాల్ ఆటగాడు పీలే అసలు పేరు ఏమిటి.?
జ : ఎడ్సన్ ఆరాంట్స్ డో నాసిమియాంటో

2) అత్యవసర విమానాల ల్యాండింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ హైవేను రన్ గా మార్చారు.?
జ : కొరిశపాడు (బాపట్ల జిల్లా)

3) 2022లో ఎన్ని స్టార్టప్ లు అనుమతి పొందాయి.?
జ : 84,012

4) శాస్త్రీయ పర్యావరణ కేంద్రం (CSE) నివేదిక ప్రకారం 2022లో ఎంత శాతం అటవీ భూమి సారం కోల్పోయింది.?
జ : 22%

5) “ఏ లైఫ్ ఇన్ ద షాడోస్” ఎవరి జీవిత చరిత్ర.?
జ : రా మాజీ అధికారి ఎ.ఎస్. దులత్

6) ఏ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.?
జ : అసోం

7) పుట్‌బాల్ ప్రపంచ కప్ చరిత్ర లో సెమీ ఫైనల్ కి చేరిన తొలి ఆప్రికా జట్టు ఏది.?
జ : మొరాకో (2022)

8) సోషల్ ప్రొగ్రస్ ఇండెక్స్ – స్టేట్స్ & డిస్ట్రిక్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : TS – 36, AP – 23

9) భారత 78వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు.?
జ : కౌస్తవ్ చటర్జీ

10) డిసెంబర్ 2022లో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1,49,507 కోట్లు

11) ఏ దేశ ప్రజలను కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే దేశంలోకి అనుమతి ఇవ్వాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.?
జ : “చైనా, హంకాంగ్, మకావ్

12) కేంద్ర నివేదిక ప్రకారం 2021లో సెల్ పోన్ వాడుతూ డ్రైవింగ్ వలన ఎంతమంది యాక్సిడెంట్ లలో మరణించారు.?
జ : 1,040

13) డిసెంబర్ 2022లో భారత్ లో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదు అయింది.?
జ : 8.30%

14) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆనాధ పిల్లల కోసం 101 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేసింది.?
జ : హిమాచల్ ప్రదేశ్

15) ఏ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఆంధ్రప్రదేశ్

16) హైదరాబాద్ లో జనవరి ఒకటిన ప్రారంభించిన రెండవ అతిపెద్ద ప్లైఓవర్ ఏది.?
జ కొత్తగూడ ప్లైఓవర్

17) అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్స్ షిప్ 2022 లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఆటగాళ్లు ఎవరు.?
జ : మాగ్నస్ కార్లసన్, బిబిసారా అసబుయోవా