Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 1st DECEMBER 2024

CURRENT AFFAIRS 1st DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 1st DECEMBER 2024

CURRENT AFFAIRS 1st DECEMBER 2024

1) తెలంగాణ రాష్ట్రంలో తాజా లెక్కల ప్రకారం ఎన్ని లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు.?
జ : 1.58 లక్షల మంది

2) భూ దిగువ కక్ష్యలో ఎన్ని వేలకు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. ?
జ : 10 వేలకు పైగా

3) ఉత్తరప్రదేశ్‌ సంభల్‌లోని మొఘల్‌ కాలం నాటి ఏ మసీదు రక్షిత వారసత్వ కట్టడమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది.?
జ : షాహీ జామా మసీదు

4) ఏ కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని తేలింది.?
జ : లెనాకావిర్

5) ఇతర వృత్తుల్లో ఉన్నవారితో సమానంగా సెక్స్‌ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ ఏ యూరప్‌ దేశం విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది.?
జ : ‘బెల్జియం’

6) ఏ ఇండియన్‌ – బ్రిటిష్‌ బాలుడు మేధాశక్తిలో రికార్డు సృష్టించాడు. ఐక్యూ స్కోర్‌ 162 సాధించి, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌లను మించిపోయాడు.?
జ : క్రిష్‌ అరోరా (10)

7) అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ డైరెక్టర్‌గా ఎవరిని డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు.?
జ : కష్యప్ పటేల్

8) దేశంలో నవంబర్ 2024 లో జీఎస్టీ వసూళ్లు ఎన్ని లక్షల కోట్లు.?
జ : 1.82 లక్షల కోట్లు

9) ఏ దేశంలో తాజాగా ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవలో 100 మందికిపైగా మరణించారు.?
జ : గినియా

10) సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ – 2024 మహిళల సింగిల్స్‌ విజేత ఎవరు.?
జ : పీవీ సింధు

11) అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : జై షా

12) అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ జూనియర్‌-100 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకున్న తెలంగాణ క్రీడాకారిణి ఎవరు.?
జ : బసిరెడ్డి రిషిత రెడ్డి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు