1) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2022 విజేత ఎవరు.?
జ : ఇంగ్లండ్ (రెండోసారి)
2) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు.?
జ : శ్యామ్ కర్రన్ (ఇంగ్లండ్)
3) ఐసీసీ నూతన చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : గ్రేగ్ భార్క్‌లే
4) ఇటీవల బ్రిటిష్ అత్యున్నత పౌర పురష్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పొందిన నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు.?
జ : వెంకీ రామకృష్ణన్ (2009 కెమిస్ట్రీ నోబెల్ విజేత)
5) ప్రపంచంలో ఎత్తైన పోలింగ్ కేంద్రం ఏది.?
జ : తాసిగాంగ్ (హిమాచల్ ప్రదేశ్)
6) నవంబర్ 10 న “మిల్లెట్ డే” గా ఏ రాష్ట్రం జరుపుకుంటుంది.?
జ : ఒడిశా
7) “ఫ్లడ్ హబ్” అనే వాతావరణ విభాగాన్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది.?
జ : గూగుల్
8) దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ పరిశ్రమను తెలంగాణ లోని జహీరాబాద్ లో ఏ సంస్థ ఏర్పాటు చేసింది.?
జ : హట్సన్
9) 2021 భూగర్భ జలాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయి.?
జ : తెలంగాణ : 21.11 శతకోటి ఘ.మీ
ఏపీ : 27.22 శతకోటి ఘ.మీ.
10) ఏ రాష్ట్ర శాసనసభ తమ మూలవాసులను గుర్తించడానికి 1932 నాటి భూమి రికార్డులను ప్రమాణికంగా తీసుకోవాలనే బిల్లును ఆమోదించింది.?
జ : జార్ఖండ్