BIKKI NEWS : CURRENT AFFAIRS 10th DECEMBER 2024
CURRENT AFFAIRS 10th DECEMBER 2024
1) పక్షపాత వైఖరితో సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు మంగళవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఏ ఆర్టికల్ ప్రకారం ఇది సాద్యం.?
జ : ఆర్టికల్ 61 (బి)
2) క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్- 2025లో భారత్‌లోని యూనివర్సిటీల్లో సుస్థిరత అంశంలో ఏ యూనివర్సిటీ భారత్ నుంచి అగ్ర స్థానంలో నిలిచింది.?
జ : ఐఐటీ ఢిల్లీ (171)
3) ప్రపంచ వ్యాప్తంగా పొడి భూములు (డ్రైల్యాండ్స్) దాదాపు ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించాయని ఐరాస చెప్పింది.?
జ : 43 లక్షల
4) ఏ దేశంలోని జంతువుల్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని, తాజాగా సైంటిస్టులు హెచ్చరించారు.?
జ : అమెరికా
5) అమెరికా సివిల్స్ రైట్స్ అటార్నీగాట్రంప్ ఎవరిని నియమించారు?
జ : హర్మీత్ దిల్లాన్
6) 2020 ఎప్రిల్ – 2024 సెప్టెంబర్ మద్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్ లోకి ఎన్ని వచ్చాయి.?
జ : లక్ష కోట్ల డాలర్లు
7) భారత్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా ఏ దేశం నుంచి వచ్చాయి.?
జ : మారిషస్ (25%)
8) ఐరాస చాంఫియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు 2024 ఏ భారతీయుడు గెలుచుకున్నాడు.?
జ : మాధవ్ గాడ్గిల్
9) క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్- 2025లో భారత్‌లోని యూనివర్సిటీల్లో పర్యావరణ విద్య అంశంలో ఏ యూనివర్సిటీ భారత్ నుంచి అగ్ర స్థానంలో నిలిచింది.?
జ : IISc – బెంగళూరు
10) క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్- 2025లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : టొరంటో యూనివర్సిటీ
11) నమీబియా దేశపు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : నిటుంబో నందిన్‌దైత్వా
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER