CURRENT AFFAIRS – 02 DECEMBER 2022

1) నవంబర్ మాసంలో జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 1.46 లక్షల కోట్లు

2) ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవని డిసెంబర్ నెలకు గాను ఏ దేశం చేపట్టనుంది.?
జ : భారత్

3) అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణ లో ఎక్కడ 9,600 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల పరిశ్రమను నెలకొల్పనుంది.?
జ : మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో

4) ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని డిసెంబర్ 1న జరుపుకున్నారు.?
జ : నాగాలాండ్

5) ఇంటర్నేషనల్ లూసోపోన్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది.?
జ : గోవా

6) 48,500 సంవత్సరాల నాటి ఏ వైరస్ ను రష్యా శాస్రవేత్తలు మళ్లీ సృష్టించారు.?
జ : జాంబీ వైరస్

7) టాటా వారి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో ఏ సంస్థ విలీనం కానుంది.?
జ : విస్తారా

8) 2022 జూలై – సెప్టెంబర్ త్రైమాసికానికి NSO ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.3%

9) ప్రాన్స్ లో జరగనున్న ‘భారత్ ఆప్రికా మానవీయ శాస్త్రాల సంభాషణ’ అనే కార్యక్రమానికి భారత్ నుండి ఎవరు హజరవుతున్నారు.?
జ : ఆద్యకళ ను వెలకితీసిన తిరుమలరావు, గూడూరు మనోజ్

10) ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన థర్మల్ విద్యుత్ కేంద్రం ఏది.?
జ : జైపూర్ లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (తెలంగాణ)

11) ఇటీవల హతమైన ISIS చీఫ్ ఎవరు.?
జ : అబూ హల్ హసన్ హల్ హసిమీ హల్ ఖురేషీ

12) హరున్ నివేదిక ప్రకారం మార్కెట్ విలువ ఆధారంగా దేశంలో అత్యంత విలువైన కంపెనీ ఏది.?
జ : రిలయన్స్