CUET UG : ఒకే ఎంట్రెన్స్ తో 10 సబ్జెక్టులకు అర్హత

హైదరాబాద్ (మార్చి 09): కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET – UG) ప్రవేశ పరీక్ష ద్వారా ఒకే పరీక్ష రాసి 10 సబ్జెక్టులను ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించారు.

సెంట్రల్ యూనివర్సిటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ (యూజీ)కి మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది 150 యూనివర్సిటీలు ఇప్పటికే సీయూఈటీ స్కోర్ ఆధారంగా ఆడ్మిషన్లు చేపట్టేందుకు ముందుకొచ్చాయని, త్వరలోనే వీటి సంఖ్య 200కు చేరుతుందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు.

https://bikkinews.com/cuet-2023-schedule-released/