న్యూఢిల్లీ (ఫిబ్రవరి – 21) : అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశంలోని అన్ని సెంట్రల్ వర్సిటీలు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET – UG) ను తప్పనిసరిగా పాటించాల్సిందేనని UGC స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు సీయూఈటీని పాటించాల్సిందేనని స్పష్టంచేసింది.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలకు తాము సీయూఈటీని పూర్తిస్థాయిలో పాటించమని… గత ఏడాదిలా పరిమిత కోర్సుల్లో అడ్మిషన్లకే సీయూఈటీ-2023లో పాల్గొంటామని ఏఎంయూ పేర్కొన్న నేపథ్యంలో యూజీసీ స్పష్టతనిచ్చింది.