న్యూఢిల్లీ (మే – 21) : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వ విద్యాలయాలుమరియు అనుబంధ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే (CUET(UG) – 2023 EXAMS STARTS)ప్రవేశ పరీక్షలను నేటి నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) నిర్వహిస్తుంది.
ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులే అందుబాటులో ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
మే 25, 26, 27, 28వ తేదీలలో జరిగే పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను nta అందుబాటులో ఉంచింది. అలాగే ఈ తేదీలలో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలోనే విడుదల కానున్నాయి.