న్యూడిల్లీ (ఫిబ్రవరి – 12) : దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో బ్యాచిలర్ డిగ్రీ చేసేందుకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET – 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలలు మరియు డీమ్డ్ యూనివర్సిటీలలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో సీటు పొందవచ్చు. ఈ ప్రవేశ పరీక్షను తెలుగుతోపాటు 13 భాషలలో నిర్వహించనున్నారు.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి – 09 – 2023
◆ దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 12 – 2023 (రాత్రి 9.00 గంటల వరకు)
◆ దరఖాస్తు ఫీజు :పేపర్లు సంఖ్య ఆధారంగా
◆ ప్రవేశ పరీక్ష తేదీ : మే – 21 – 2023
◆ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ తేదీ : మే నెల రెండో వారంలో