సీ టెట్ 2021 ఫలితాలు విడుదల

జనవరి 31న జరిగిన CTET ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్‌ ctet.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది.

దేశవ్యాప్తంగా 135 పట్టణాల్లో జనవరి 31న ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించారు. పేపర్‌-1లో 4,14,798 మంది క్వాలిఫైకాగా, పేపర్‌-2లో 2,39,501 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

కాగా, పేపర్‌-1 కోసం 16,11,423 మంది రిజిస్టర్‌ చేసుకోగా 12,47,217 మంది పరీక్ష రాశారు. పేపర్‌-2 కోసం 14,47,551 మంది దరఖాస్తు చేసుకోగా 11,04,454 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఆన్సర్‌ కీని CBSE గత వారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

WEBSITE :: https://ctet.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P

Follow Us@