IPL PLAYOFF : పదోసారి ఫైనల్ చేరిన ధోనీ టీమ్

చెన్నై (మే – 23) : ఐపీఎల్ – 2023 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ పై చెన్నై (CSKvsGT) ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్ కు చేరింది. 15 పరుగుల తేడాతో తో గుజరాత్ పై గెలుపు సాదించింది.

టాస్ గెలిచి గుజరాత్ జట్టు చెన్నై జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. చెన్నై ఓపెనర్లు రాణించడంతో చెన్నై జట్టు 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులను సాధించింది. గైక్వాడ్ 60, కాన్వే 40 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్ (42) మినహా ఎవరు రాణించలేదు. 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.

గుజరాత్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ – 2 మ్యాచ్ ఆడనుంది.