CSIR UGC NET 2023 : నెట్ నోటిఫికేషన్ విడుదల

  • డిసెంబర్ – 2022, జూన్ – 2023 NET పరీక్షల షెడ్యూల్స్ విడుదల

హైదరాబాద్ (మార్చి 12) : సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2022 డిసెంబర్, 2023 జూన్ మాసాల్లో నిర్వహించాల్సిన నెట్ ఎంట్రెన్స్ షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్‌షిప్, అసిస్టెంట్ ప్రొపెషర్‌షిప్ వంటి అర్హతల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు గడువు : ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్ లో ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తు ఎడిట్ : ఏప్రిల్ 12 నుంచి 18 వరకు

పరీక్ష తేదీలు : ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పద్ధతిలో ఈ ఏడాది జూన్ 6, 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వ హిస్తామని ఎన్టీఏ ప్రకటించింది.

సబ్జెక్టులు : కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులలో నిర్వహిస్తారు.

◆ వెబ్సైట్ : https://csirnet.nta.nic.in/