CRPF JOBS : 212 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు

న్యూడిల్లీ (ఎప్రిల్‌ – 28) : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF SI, ASI JOBS) గ్రూప్ బీ, సీ కేటగిరీలో 212 సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

◆ పోస్టుల వివరాలు :

  1. సబ్-ఇన్స్పెక్టర్(ఆర్వో): 19 పోస్టులు
  2. సబ్-ఇన్స్పెక్టర్(క్రిప్టో) : 7 పోస్టులు
  3. సబ్-ఇన్ స్పెక్టర్(టెక్నికల్): 5 పోస్టులు
  4. సబ్-ఇన్స్పెక్టర్(సివిల్) (మేల్): 20 పోస్టులు
  5. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (టెక్నికల్): 146 పోస్టులు
  6. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్(డ్రాఫ్ట్మ్యేన్): 15 పోస్టులు

◆ మొత్తం పోస్టుల సంఖ్య : 212.

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : 21.5.2023 నాటికి ఎస్సై పోస్టులకు 30 సంవత్సరాల లోపు,. ఏఎస్సై పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి.

◆ దరఖాస్తు ఫీజు : ఎస్సై పోస్టులకు రూ.200/-, ఏఎస్సై పోస్టులకు రూ.100/; (ఎస్సీ/ ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తులు గడువు : మే 01 నుండి మే 21 – 2023. వరకు

◆ అడ్మిట్ కార్డుల విడుదల : జూన్ – 13 – 2023 నుంచి

◆ రాత పరీక్ష తేదీలు : జూన్ – 24 & 25, – 2023 న

◆ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

◆ వెబ్సైట్ : https://rect.crpf.gov.in/