మెదక్ టౌన్ (మార్చి – 25) స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యంగ్ స్టార్స్ ఫౌండేషన్ ట్రస్ట్ మెదక్ మరియు వి ఫర్ వుమెన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ గణపతి తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రతిభాలక్ష్మి మరియు వారి బృందం డాక్టర్ అన్నపూర్ణ డాక్టర్ సంధ్య లు విద్యార్థులకు సిపిఆర్ ఎలా చేయాలో ప్రత్యక్ష శిక్షణను ఇచ్చినారు. అలాగే ప్రాణాపాయ సమయంలో ప్రథమ చికిత్స ఎలా చేయాలో కూడా వివరించారు. సామాజిక సేవలో భాగంగా మెదక్ డిగ్రీ విద్యార్థులకు యంగ్ స్టార్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షురాలు,
కౌన్సిలర్ రాగి వనజ వారి సభ్యులతో కలిసి డాక్టర్ల బృందాన్ని కళాశాలకు రప్పించి వందల మంది నవ యువత అయిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిపిఆర్ పై అవగాహన కల్పించిన ప్రతిభా లక్ష్మిని వారి డాక్టర్ల బృందాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ గణపతి మరియు అధ్యాపకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్లను జీవనశైలిని మార్చుకోవడం ద్వారా గుండెపోటు నుండి రక్షణ పొందవచ్చని సూచించారు.
వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ స్థానిక కౌన్సిలర్లు శ్రీధర్ యాదవ్, మధుసూదన్ రావు, అశోక్ తదితరులతోపాటు అధ్యాపకులు వామనమూర్తి, దినకర్, సుధాకర్ ఏవో లక్ష్మి, భవాని, జోతిర్మయి, నారాయణ, వినోద్ కుమార్, పశుపతి శర్మ, వేణుగోపాల్, మురళి నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.