CPGET 2023 : జర్నలిజం, ఎమ్మెస్సీ డాటాసైన్స్ ప్రవేశ పరీక్షలు

హైదరాబాద్ (ఆగస్టు 12) : ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎమ్మెస్సీ డాటా సైన్స్ కోర్సుల ప్రవేశ పరీక్షలను ఆగస్టు 31న నిర్వహించనున్నట్టు కామన్ పోస్టుగ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (CPGET 2023 EXAMS) కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 28 నుంచి అధికారిక వెబ్సైట్ లలో అందుబాటులో ఉండనున్నాయి.

హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్షాకేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఇక బీఎస్సీ డాటా సైన్స్ విద్యార్థులు పీజీలో చేరేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఎమ్మెస్సీ డాటాసైన్స్ కోర్సును నూతనంగా ప్రవేశపెట్టారు.

◆ వెబ్సైట్ : www.cpget.tsche.ac.in