హైదరాబాద్ (జూన్ – 30) : తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (CPGET – 2023 EXAMS) పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి జూలై 10 వరకు ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
ఈ పరీక్షలను మొత్తం తొమ్మిది రోజులపాటు రోజుకు మూడు సెషన్స్ పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు
మొదటి షిఫ్ట్ 9:30 – 11:00 వరకు, రెండవ షిప్ట్ 01:00 – 02:30 వరకు, మూడో షిఫ్టు 04:30 – 6:00 వరకు నిర్వహించనున్నారు.
◆ వెబ్సైట్ : https://cpget.tsche.ac.in/CPGET/CPGET_HomePage.aspx