CPGET 2023 COUNSELLING : కౌన్సెలింగ్ షెడ్యూల్

హైదరాబాద్ (ఆగస్టు – 30) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కానుంది. CPGET 2033 COUNSELING SCHEDULE ను విడుదల చేశారు.

మొత్తం రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లు, జేఎన్టీయూహెచ్ ఎంఎస్సీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 22న సీపీగెట్ ఫలితాలు వెల్లడించగా అందులో ఉత్తీర్ణులైన 55,739 మంది కన్వీనర్ సీట్ల కోసం పోటీపడొచ్చు.

జర్నలిజంతో పాటు ఎంఎస్సీ డేటా సైన్స్ సీట్ల కోసం ఈ నెల 31న ప్రవేశ పరీక్ష జరగనుందని, వారు కూడా కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చని కన్వీనర్ తెలిపారు.

సెప్టెంబరు 5-15 వరకు ఆన్లైన్ లో ధ్రువపత్రాల పరిశీలనకు రిజిస్ట్రేషన్,

సెప్టెంబర్ – 19న సమర్పించిన వివరాల్లో తప్పుల సవరణ,

సెప్టెంబర్ 20-22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు,

సెప్టెంబర్ 26న తొలి విడత సీట్ల కేటాయింపు,

సెప్టెంబర్ 29 వరకు సీట్లు పొందిన వారు కళాశాలల్లో రిపోర్టింగ్ ఉంటుందని,

అక్టోబరు 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.

Comments are closed.