CPGET – 2020 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివిధ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించిన CPGET – 2020 లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది.

ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపుకు తేదీ లను ప్రకటించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 12 నుండి 22వ తేదీ వరకు గడువు కలదు. అలాగే వెబ్ ఆప్షన్లు జనవరి 20వ తేదీ నుండి ఎన్నుకోవడానికి షెడ్యూల్ విడుదల చేశారు.

ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల పరిధిలో పీజీ కళాశాలలో అన్ని పీజీ కోర్సులకు గాను CPGET – 2020 పరీక్షను నిర్వహించి తాజాగా ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

వెబ్సైట్ ::

http://ocv.ouadmissions.com/#