CPET ADMISSIONS : వివిధ డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 29) : హైదరాబాద్ – చర్లపల్లిలోని జాతీయ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ సాంకేతికత సంస్థ (సిపెట్) 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశాల(స్పాట్ అడ్మిషన్ల) కోసం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

పదో తరగతి ఉత్తీర్ణత గల వారు మెకానికల్ డిప్లొమాలో, బీఎస్సీ విద్యార్హత గల వారు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం సంప్రదించాలని సంస్థ డైరెక్టర్, ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు సూచించారు. ఇంటర్ విద్యార్హత గల వారికి నేరుగా డిప్లొమా రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.

ఆసక్తి గలవారు 9677256436, 8093140230 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.