CP GET ఫిజిక్స్‌ పరీక్ష రద్దు.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్‌ పరీక్షలు (CPGET – 2020) డిసెంబర్ 1 నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 5న నిర్వహించిన ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పరీక్షను రద్దు చేసినట్లు, ఈ పరీక్షను డిసెంబర్‌ 11న మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తామని CPGET కన్వీనర్‌ ఎన్‌. కిషన్‌ తెలిపారు.

అదేవిధంగా భారత్‌ బంద్‌ వల్ల డిసెంబర్ 8వ తేదీన జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని, వాటిని డిసెంబర్ 14న నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారిక వెబ్సైట్ ల నుంచి మరోమారు హాల్‌టికెట్లను డౌన్లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

● వెబ్సైట్ లు ::

https://www.cpget.tsche.ac.in/

http://www.tscpget.com/CPGET/CPGET_HomePage.aspx

Follow Us@