విద్యా సంస్థలలో విద్యార్థులు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు

రేపటి నుంచి తెలంగాణ లో విద్యా సంస్థలు భౌతికంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు…

 • విద్యార్థినీ విద్యార్థులందరూ తప్పని సరిగా మాస్కు ధరించి కళాశాలకు రావాలి. మాస్కు లేని వారికి అనుమతి లేదు. మరియు కళాశాల ప్రవేశ ద్వారం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత చేతులు శానిటైజ్ చేసుకున్న తరువాత మాత్రమే లోపలికి ప్రవేశించాలి.
 • విద్యార్థికి విద్యార్థికి మరియు అధ్యాపకులకు మధ్య ఆరు అడుగులు లేదా రెండు గజాల భౌతిక దూరం పాటించాలి.
 • పెన్నులు, పెన్సిల్ లు, పుస్తకాలు కాపీలు ఏవీ ఇతరులకు ఇవ్వవద్దు, ఇతరుల నుండి తీసుకొనవద్దు.
 • ఇతరుల వస్తువులు ఏవి ముట్టుకున్నా చేతులు సబ్బుతో 20 సెకన్ల పాటు తరుచుగా శుభ్రపరుచుకోవాలి.
 • ఆహారం లేదా తినుబండారాలు ఏవి కూడా ఒకరివి ఒకరు ఇచ్చుకొనవద్దు-ఎవరివి వారే తినాలి.
 • ఎవరి వాటర్ బాటిల్ వారే తెచ్చుకోవాలి- ఎవరి నీళ్ళు వారే తాగాలి.
 • కళాశాల ఆవరణలో ఉమ్మి వేయకూడదు. మరియు ముక్కును, నోటిని చేతిలో తాకరాదు.
 • కళాశాలకు వచ్చేటపుడు గుంపులుగా రా‌కూడదు. వెళ్ళేటపుడు గుంపులుగా వెళ్ళకూడదు.
 • వాడిన మాస్కులు, ఖాళీ శానిటైజర్ సీసాలు, చిత్తు కాగితాలు, ఇతర వస్తువులు ఏమైనా ఉంటే చెత్త డబ్భాలో మాత్రమే వేయాలి.
 • కళాశాల లోపలికి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు తరగతి గదిలో మరియు తరగతి గది బయట (ఆటస్థలం, భోజన సమయం, మూత్రశాలకు వెళ్ళే సమయంలో, చేతులు కడిగేటపుడు) ఏ ఇద్దరు విద్యార్థులు కూడా గుంపులుగా చేరవద్దు ఒంటరిగానే ఉండాలి. ఒంటరిగానే తిరగాలి.
 • అనవసరంగా ఎవరూ తరగతిగది నుండి బయటికి రావొద్దు. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.
 • జ్వరం, జలుబు, దగ్గు మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే కళాశాలకు సమాచారం ఇచ్చి, కళాశాలకు రానవసరం లేదు.
 • కళాశాలకు వచ్చిన తరువాత జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నట్లైతే కళాశాల ప్రిన్సిపాల్ గారిని గానీ అధ్యాపకులకు గానీ సంప్రదించండి.
Follow Us@