కొత్త ర‌కం క‌రోనా ఒమిక్రాన్ (1.1.529) పై ప్రధాని సమీక్ష

ఆఫ్రికా ఖండం ద‌క్షిణ దేశాల్లో బ‌య‌ట‌ప‌డి ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డలాడిస్తున్న కొత్త ర‌కం క‌రోనా ఒమిక్రాన్ (1.1.529) విస్తృతిపైన‌, దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియపైన ప్ర‌ధాని ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( omicron ) గురించి అధికారులను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. క‌రోనా కొత్త వేరియంట్ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అధికారుల‌కు ప్ర‌ధాని మోదీ సూచించారు. అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా స్థాయిలో క‌రోనా న్యూ వేరియంట్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.