Covid Nasal Vaccine కి కేంద్రం అమోదం

న్యూడిల్లీ (డిసెంబర్ – 23) : కేంద్ర ప్రభుత్వం బారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన కోవిడ్ నాజల్ వ్యాక్సిన్ కు అమోదం తెలిపింది.

ఈ రోజు నుంచి ప్రైవేటు హస్పిటల్ లలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉండనుంది. కోవాక్సీన్, కోవిషీల్డ్ వేసుకున్న వారు దీనిని బూస్టర్ డోస్ గా వేసుకౌవచ్ఛు.

18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ నాజల్ వ్యాక్సిన్ ను వేసుకోవాలి. ఈ రోజు నుండి కోవిన్ వెబ్సైట్ మరియు యాప్ లలో ఇది కూడా ఉండనుంది.

హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచంలో నే మొదటి ఇంట్రా నాజల్ వ్యాక్సిన్ ఉత్పత్తి దారంగా నిలిచింది. దీనిని ఐనోవాక్ పేరుతో విడుదల చేశారు.