కరోనా నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అలాగే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది.
భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌పై యద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Follow Us @‘‘మన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మిగిలిన కరోనా వారియర్స్ దేశ కష్టకాలంలో చేసిన సేవలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మనందరం వారికి రుణపడి ఉంటాం’’
భారత ప్రధాని నరేంద్ర మోడి