BIKKI NEWS (OCT. 27) : Counselling programme on mental stress at GJC Geesugonda. ప్రభుత్వ జూనియర్ కళాశాల గీసుగొండలో ప్రిన్సిపాల్ యన్. ఆశోక్ రావు ఆధ్వర్యంలో మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైక్రియాటిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ విద్యార్థులకు మానసిక ఒత్తిడి పై అవగాహన కల్పించారు.
Counselling programme on mental stress at GJC Geesugonda
ఈ సందర్భంగా డాక్టర్ భరత్ కుమార్ మాట్లాడుతూ అన్ని వయసుల వారికి మానసిక ఒత్తిడి ఉంటుందని. గుడ్ స్ట్రేస్ ఉన్నప్పుడు జీవతాన్ని మంచిగా మలుచుకొవాలని సూచించారు.
విద్యార్థి పరిధిలో ఉన్న అభ్యాసన, ప్రవర్తన, సమయపాలన, కర్తవ్యం మరియు లక్ష్య సాధనపై మన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు.
ర్యాంకుల గురించి మరియు మార్కుల గురించి అధిక ఒత్తిడికి గురి కాకుండా మన ప్రయత్నం మనం చేయాలని సూచించారు.
మానసిక ఒత్తిడికి లోను కాకుండా శారీరక శ్రమ చేయడం, యోగా చేయడం, సెల్ ఫోన్ కు దూరంగా ఉండటం, మైండ్ గేమ్స్ ఆడటం, ప్రకృతితో గడపడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఎప్పటి పనులను అప్పుడే చేసుకోవడం, సమయపాలన పాటించడం వంటి వాటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డాక్టర్ భరత్ కుమార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ అశోక్ రావు, స్టూడెంట్ కౌన్సిలర్ ఎన్. రాజకుమార్, అధ్యాపకులు రమణాకర్, శశిధర్, మహేందర్, వెంకట నారాయణ, ప్రసాద్, శ్రీనివాస్, జ్యోతి, చందన, రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.